Thursday, January 1, 2009

మనిషి జీవనానికి ఏది ఆధారం? డబ్బా , మానవత్వమా
మానవత్వమే ఐతే అందరు డబ్బు కొరకు ఎందుకు ఇలా పరుగులు పెడుతున్నారు?
లంచం తీసుకోవడం తప్పు అనే స్థాయి నుండి తీసుకున్నా పరవాలేదు పని చేస్తున్నడుగా అనే స్థాయికి ఎందుకు పడిపోతున్నాము
అత్తా మామలను ఇంట్లోనుండి గెంటి వేయాలని ప్రయత్నించే కోడళ్ళు , తప్పని వారికి చెప్పకుండా వారిని ఎగదోసే వారి తల్లిదండ్రులూ
చట్టాలతో మనుషులను కంట్రోల్ చేయాలనే వారి మనస్తత్వాలు
మానసిక బంధాలను అవి ఎలా నియంత్రిస్తాయి
కొన వూపిరితో కొట్టుకొనే ఓ మంచితనమా ,నీకు ఏది దారి
అసలు ఒక వ్యక్తిని మంచివాడుగా గుర్తించకపోవడానికి కారణమేమిటి
మనం తక్కువవుతమేమోననే భయం ,మనల్ని కాక వేరే ఎవరిని పొగడినా మనకు అసూయ
అందుకే ఒకడిని మంచి అనిగాని వాడి పనిని మంచి అని గాని మనం అనము
పక్కవాడి తప్పుని చూపడానికి ఆదిసేషువులా వెయ్యి తలలతో విరుచుకు పడే మనం
వాడి మంచిని పొగడడానికి మనకున్న ఒక్క నోటిని కూడా వుపయోగించం
విలువల వలువలు వూదదీసే మన కార్యక్రమానికి ఇప్పటికైనా ఫుల్ స్టాప్ పెట్టి
మంచిని మాట్లాడదాం ,మంచిని పోగుడుదాం , మంచిని ఆచరిద్దాం
ఓ మేధావులారా ఆలోచించండి

Friday, December 26, 2008

sambandhalu

ఉమ్మడి కుటుంబాలు దూరమవుతున్నాయి
దానితోపాటే అనుబంధాలు మరియు ఆప్యాయతలు.
బామ్మలు వారి లాలిపాటలు , తాతలు వారి కథలు
అన్నీ పోయేక మిగిలినది
ఇరుకు పెట్టెలలో బంధీ అవుతోన్న బాల్యం
కోడి కెలికినట్లు అక్షరాలు , కాకపోతే అనేక చానెళ్ళు
పెద్దలకు ఆఫీసులు ,తప్పితే సెల్ ఫోన్లు
పిల్లలకు అన్నం పెట్టే తీరిక తల్లి కుండదు
చేయి పట్టుకొని ఆడే తీరిక తండ్రి కుండదు
ఇది దానంతట అది వచ్చిందా లేక మనం తెచ్చుకొంటున్నదా
ఒక్కసారి ఆలోచించండి ఓ తల్లిదండ్రులారా
ఉగ్రవాదాలు , రౌడీయిజాలు వీటి ఫలితాలు కాదా
ప్రేమ రాహిత్యంతో ఎదిగే ఈ పిల్లలు ఎటు పరిగెడుతున్నారు ?
ఇప్పటి నుండైనా మన పిల్లలను పట్టించుకొందాం
ప్రశాంతమైన లోకాన్ని నిర్మిద్దాం